కల్లేపల్లిలో కుల బహిష్కరణ.. సీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కుల సంఘం చిట్టి డబ్బులు చెల్లించటం లేదని అరోపిస్తూ ఓ వ్యక్తి తో సహ కుంటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన సంఘటన బెజ్జంకి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, బెజ్జంకి : కుల సంఘం చిట్టి డబ్బులు చెల్లించటం లేదని అరోపిస్తూ ఓ వ్యక్తి తో సహ కుంటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన సంఘటన బెజ్జంకి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో కుల సంఘం చిట్టి డబ్బులు చెల్లించినప్పటికీ కుల సంఘం పెద్దలు అసత్య అరోపణలు చేస్తూ మైల భాస్కర్ తో పాటుగా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ప్రశ్నిస్తే కుల పెద్దలు తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. కుల పెద్దల నుండి తమ కుటుంబానికి ప్రాణ హని ఉందని ఈ విషయం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలపారు. ఈ విషయై అధికారులు విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని భాస్కర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.