బ్లాక్ మెయిల్ రాజకీయాలతో భయపెట్టలేరు : మున్సిపల్ చైర్మన్
కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు
దిశ,జమ్మికుంట: కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి ఓ ఫంక్షన్ లో తనకు తారసపడిన కౌన్సిలర్ రాజు తనను అవహేళన చేశాడని, పద్ధతి మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినకపోగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు.
తనపై పెట్టిన అవిశ్వాస సమయంలో రూ.5 ఐదు లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించాడు. తాను అవినీతి చేశానని పదేపదే చెప్పుకుంటున్న కౌన్సిలర్లు దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. కొందరు కౌన్సిలర్లు తనను డబ్బులు అడిగారని, తాను ఇవ్వనందుకే అవిశ్వాసం పెట్టారని చెప్పుకొచ్చారు. విలేకరుల సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.