బండి సంజయ్ కరీంనగర్ జిల్లా పరువు తీయకు: జీవీ రామకృష్ణ రావు
ఎంఐఎం అధినేత మాటలను వక్రీకరించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరపున ఖండిస్తున్నామని, కరీంనగర్ జిల్లా పరువు తీయోద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు అన్నారు.
దిశ, కరీంనగర్ టౌన్: ఎంఐఎం అధినేత మాటలను వక్రీకరించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరపున ఖండిస్తున్నామని, కరీంనగర్ జిల్లా పరువు తీయోద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ రామకృష్ణ రావు మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం మీద ఉన్న చిహ్నాలను కూలగొట్టి భారతీయ, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణం చేస్తానని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బండి సంజయ్ హిందువుల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని అన్నారు.
రానా ప్రతాప్ వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఉదయపూర్ ఖిల్లా చూసి తాజ్ మహల్ నిర్మాణం చేశారని, అలాంటి చిహ్నాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అసెంబ్లీ మీద కూడా అలాంటి చిహ్నాలు ఉన్నాయని, మరి అలాంటి అసెంబ్లీలోకి మీ బీజేపీ ఎంఎల్ఏలు ఎందుకు వస్తున్నారని, మొదట వారితో రాజీనామా చేయించాలని అన్నారు. బండి సంజయ్ ఎప్పుడూ మాట్లాడిన గుడి, మతం, ఎన్నికల గురించే మాట్లాడుతారని విమర్శించారు. మా పార్టీ ఫండ్ నుంచి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని దేశంలోని అన్ని ప్రదేశాలలో కట్టడాలు చూసి రావాలని బండి సంజయ్ కి సూచించారు. బేషరతుగా గీతా భవన్ చౌరస్తా వద్ద బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.