SI Kothapalli Ravi : సైబర్ క్రైమ్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది..

శంకరపట్నం మండలంలోని చింతలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మోసాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Update: 2024-08-10 16:08 GMT

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని చింతలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మోసాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, సైబర్ క్రైమ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అన్నారు. సైబర్ నేరగాళ్లు వ్యక్తుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని, ఈ ప్రమాదంలో పేద, మధ్యతరగతి అని తేడా లేకుండా అందరూ బాధితులేనని అన్నారు.

ముఖ్యంగా కొంతమంది అత్యాశకు పోయి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారని మరికొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెయిల్స్, మొబైల్ కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని అపరిచితులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని అన్నారు. మన జాగ్రతే మనం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడుతుందని అన్నారు. సైబర్ నెరగాళ్ల వలలో చిక్కితే వారిని పట్టుకోవడం కష్టమేనని కాబట్టి అవగాహనతోనే నష్టనివారణ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News