యథేచ్చగా అక్రమ వెంచర్లు

అధికారులు, పాలకవర్గం తన చేతిలో ఉన్నారనుకుంటున్నారేమో అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. వ్యవసాయ భూమిని వెంచర్ గా చేసి

Update: 2023-02-13 05:23 GMT

దిశ, జమ్మికుంట : అధికారులు, పాలకవర్గం తన చేతిలో ఉన్నారనుకుంటున్నారేమో అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. వ్యవసాయ భూమిని వెంచర్ గా చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ లేఔట్ లోని వెంచర్లను కొన్న బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా వెంచర్ ఏర్పాటు చేయాలి అంటే అక్కడున్న వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చడం కోసం ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించడంతోపాటు రెవెన్యూ శాఖ అనుమతులూ తప్పనిసరి.

నాలా పన్ను కట్టిన తర్వాత డీటీసీపీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధన ప్రకారం 40 ఫీట్ల రోడ్డు డ్రైనేజీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలి కానీ జమ్మికుంట నుండి హుజురాబాద్ వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వెంచర్ లో ఇక్కడ అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ అమ్మకాలు జరుపుతున్నారు. తాను ఇంకొకరికి అమ్మడం జరుగుతుంది.

Tags:    

Similar News