ఫిజియోథెరపీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా అసంక్రమిత వ్యాధుల ఎన్ సీడీ పథకం క్రింద ఒప్పంద...Applications are invited for the post of Physiotherapy

Update: 2022-12-14 11:13 GMT
ఫిజియోథెరపీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
  • whatsapp icon

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా అసంక్రమిత వ్యాధుల ఎన్ సీడీ పథకం క్రింద ఒప్పంద ప్రతిపాదికన ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ భర్తీ కొరకు అర్హులైన ఫిజియోథెరపీలో బ్యాచులర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి గుగులోతు తెలిపారు. దరఖాస్తు ఫారం, ఇతర నోటిఫికేషన్ వివరాలు జగిత్యాల జిల్లా అధికారిక వెబ్ సైట్ https://jagtial.telangana.gov.in నుండి పొందగలరు.. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంనకు స్వయం ధ్రువీకృత సర్టిఫికెట్ కాపీలను జత చేస్తూ తేదీ 15-12-2022 ఉ. 10.30 నుండి తేదీ 21-12-2022 సాయంత్రం 5.00 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం రూమ్ నెంబర్ 226) కార్యాలయములో స్వయముగా దాఖలు పరుచగలరు.. గడువు తేదీ తదుపరి ఎలాంటి సర్టిఫికెట్లు స్వీకరించబడవని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Tags:    

Similar News