దిశ, గంభీరావుపేట: ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని డీసీహెచ్ మురళీధర్ రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సీహెచ్సీని డిఆయన సందర్శించారు. అనంతరం అక్కడి వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. దాదాపు గంట పాటు ఆసుపత్రి పరిసాల్లో కలియ తిరిగారు. పీహెచ్సీని టీవీవీకి అప్పగించినందున రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు స్వీపర్లు మందులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఫార్మసిస్ట్ అందుబాటులో లేని పక్షంలో ఏఎన్ఎంలతో మందులు ఇప్పించాలని సూచించారు. ఇక ముందు అలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని వైద్యాధికారి సృజన్ ను ఆదేశించారు. వారం రోజుల్లో మరి కొంతమంది వైద్య సిబ్బంది వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సూపరింటెండెంట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ సృజన్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.