ప్రభుత్వ కార్యక్రమానికి 20 మంది కౌన్సిలర్లు డుమ్మా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్చదనం-పచ్చదనం ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Update: 2024-08-05 07:17 GMT

దిశ, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్చదనం-పచ్చదనం ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ చౌక్ నుండి బద్ది పోచమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పలువురు స్థానిక కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొనకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేవలం మున్సిపల్ పరిధిలోని ప్రజాప్రతినిధులైన మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, శ్రీనివాస రావు, ఉమరాణి, అజయ్‌లు మాత్రమే హాజరయ్యారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం హాజరు కాకపోవడం పట్టణ ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.


Similar News