Jagga Reddy: తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ రైతులకు చేసింది సున్నా: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టింది సున్నా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టింది సున్నా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని వార్తలపై ఆయన ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఆయన సీఎంగా ఉన్న నాడు.. ఎన్నడూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కేవలం ఫామ్‌హౌజ్‌కే పరిమితమై ప్రగతి భవన్‌లోకి ఎవ్వరినీ రానివ్వకుండా, సెక్రటేరియట్ వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆనాడు రైతుల వైపు ఉండి కొట్లాడింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తుస్తోందని.. సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్, మంత్రుల సమీక్షలు నిత్యం కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు హాజరు కావాలని సీఎం రేవంత్‌ స్వయంగా ఆహ్వానించారని తెలిపారు. పరిపాలనలో భాగంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినా.. కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే సభకు హాజరవ్వడం పట్ల ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. మళ్లీ నేడు కేసీఆర్ ప్రజాక్షేత్రం రాబోతున్నాడంటూ బీఆర్ఎస్ నేతలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం హస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.    


Similar News