BRS ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి.

Update: 2023-06-15 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో జూబ్లీ‌హిల్స్‌లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ అనుచరులు చేరుకుంటున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు, వ్యయాల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అమీర్ పేట్ లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు చేస్తోంది.

జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్దన్ రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన లాకర్స్‌ను సైతం ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. ఐటీ సోదాలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 

Also Read:   ఐటీ దాడులతో గులాబీ నేతల్లో పరేషాన్ .. ఎన్నికల ముందు సోదాలతో గుబులు 

Tags:    

Similar News