BRS ఎంపీ ఇంట్లోనూ ఐటీ సోదాలు

బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది.

Update: 2023-06-14 04:23 GMT
BRS ఎంపీ ఇంట్లోనూ ఐటీ సోదాలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది. ఈ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. అయితే మెదక్ ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు తనిఖీలు చేపట్టింది. ఈ రోజు తెల్లవారు జాము నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. కేంద్ర బలగాల పహారాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి డైరెక్టర్‌గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు ఐటీ గుర్తించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయగా తాజాగా ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.   

Also Read...

BRS ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు 

Tags:    

Similar News