సీఎంఓకి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌కి తేడా లేదా? నెట్టింట దుమారం లేపుతున్న సీఎంఓ పోస్టర్!

తెలంగాణ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ పోస్ట్ చేసింది. ‘ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టర్ పంచుకుంది.

Update: 2024-06-02 08:46 GMT
సీఎంఓకి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌కి తేడా లేదా? నెట్టింట దుమారం లేపుతున్న సీఎంఓ పోస్టర్!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ పోస్ట్ చేసింది. ‘ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టర్ పంచుకుంది. పోస్టర్‌లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, తెలంగాణ తల్లి, అమర వీరుల స్తూపం ఉన్నది. అయితే, ప్రభుత్వ అధికారిక పోస్టర్‌లో సోనియాగాంధీ ఉండటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే దీనిపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలంగాణ ప్రజల భావోద్వేగాలు అంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించింది.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సీఎం నిర్ణయాలు, దానికి తగ్గట్టుగానే సీఎంఓ ప్రకటనలు, పోస్టర్లు అని విమర్శించింది. సీఎంఓ హ్యాండిల్‌కి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌కి తేడా లేదా? అసలు సోనియా గాంధీకి తెలంగాణ సీఎంవో హ్యాండిల్‌కి సంబంధం ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ జెండానా? రాష్ట్ర అధికారిక చిహ్నం ఎక్కడ? ఒక ప్రోటోకాల్ అంటూ ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? అని పలు ప్రశ్నలు వేసింది. జూన్ 2 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, దశాబ్దాల కల సాకారం అయి, స్వరాష్ట్రం సిద్ధించిన రోజున కూడా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయాలు చేయడం అత్యంత హేయనీయమని విమర్శించింది. ఈ చిల్లర చేష్టలను, వికృత రాజకీయాలను తెలంగాణ సమాజం ఛీ కొడుతుందని వెల్లడించింది.

Tags:    

Similar News