బ్రేకింగ్: MLA రఘునందన్ రావుపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా!

ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Update: 2023-05-29 14:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని.. వేల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను తక్కువ ధరకే తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ సంస్థకు అప్పగించిందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా, బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఓఆర్ఆర్ కాంట్రాక్ట్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కాగా, రఘునందన్ రావు ఆరోపణలపై ఐఆర్‌బీ సంస్థ రియాక్ట్ అయ్యింది. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందన్న రఘునందన్ రావుకు ఐఆర్‌బీ కంపెనీ లీగల్ నోటీసులు ఇచ్చింది. రఘునందన్ రావుపై రూ. 1000 కోట్లకు ఐఆర్‌బీ సంస్థ పరువు నష్టం దావా వేసింది.

Tags:    

Similar News