బ్రేకింగ్: సిట్‌కు చేరిన TSPSC పేపర్ల లీక్ కేసు దర్యాప్తు

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.

Update: 2023-03-14 13:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసు దర్యాప్తును సీవీ ఆనంద్ సిట్‌కు బదిలీ చేశారు. దీంతో ఇకపై ఈ కేసు విచారణ సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో జరగనుంది. ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటనలో పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News