కుల వృత్తులను ప్రోత్సహించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం మంత్రి : పొంగులేటి

Update: 2024-10-08 08:02 GMT

దిశ కూసుమంచి: రాష్ట వ్యాప్తంగా కులవృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యంలో 100శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం వద్ద ఎంపీ రఘురామ్ రెడ్డి, రాష్ట ఫిషరీష్ చైర్మన్ సాయి, ఐటీసి చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. భారీ వరదల వల్ల మత్యకారులు తీవ్రంగా నష్ట పోయారని, మత్యకారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తీరుస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పేదోడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమన్నారు. వరదల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి త్వరలోనే ఇళ్లు ఇస్తామని స్పష్టం చేస్తూ అదే వేదిక నుంచి కూసుమంచి తహసీల్దార్ ను వరద బాధిత కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మీరు ఏ విశ్వాసంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారమిచ్చారో అదే విశ్వాసంతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి పేర్కొన్నారు.

ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ 1700 హెక్టార్ల విస్తీర్ణంను గత పూర్వ వైభవం తెచ్చే విధంగా మంత్రి పొంగులేటి సహకారంతో కృషి చేస్తామన్నారు. కేంద్రంతో ఇటు రాష్ట్రంతో మాట్లాడి వరద తాకిడికి నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మత్స్యశాఖ చైర్మన్, ఫిషరీస్ అధికారులు, ఆర్డివో,జిల్లా కాంగ్రెస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, తహసీల్దార్ సురేష్ కుమార్,ఎంపీ ఓ రామచంద్రరావు, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్,నాయకులు బజ్జురు వెంకట్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, చాట్ల పరుశరామ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News