IND Vs ENG: శతకాలతో చెలరేగిన రోహిత్, గిల్.. టీమిండియాకు భారీగా ఆధిక్యం

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా టాపార్డర్ అదరగొట్టడంతో భారీగా ఆధిక్యం లభించింది.

Update: 2024-03-08 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా టాపార్డర్ అదరగొట్టడంతో భారీగా ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. అంతుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103), శుభ్‌మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలు చేవారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కుల్దీప్ యాదవ్(27) పరుగులు, జస్ప్రీత్ బుమ్రా (19) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 170 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టామ్ హార్ట్‌లీ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక పేసర్లు జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లకు చెరో వికెట్ దక్కింది.

రోహిత్, గిల్ సెంచరీల జోరు

ఒక వికెట్ కోల్పోయి 135 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్లు కెప్టెన్ రోహిత్, శుభ్‌మన్ గిల్ జట్టుకు భారీ స్కోర్ సాధించేందుకు పునాదులు వేశారు. ఒకరి తరువాత ఒకరు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ సునాయసంగా పరుగులు రాబట్టారు. 154 బంతుల్లో రోహిత్.. 137 బంతుల్లో శుభ్‌మన్ గిల్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

Tags:    

Similar News