IIT HYD : ఐఐటీ అంటే రైట్ ఆఫ్ ఇండియా : నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం

ఐఐటీలు అంటే రైట్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఇక్కడ చదివే విద్యార్థులు, రీసర్చ్ బృందం దేశ పురోగతికి ఎంతో సహకారాన్ని అందించాయని నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కొనియాడారు.

Update: 2024-07-20 07:45 GMT

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఐఐటీలు అంటే రైట్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఇక్కడ చదివే విద్యార్థులు, రీసర్చ్ బృందం దేశ పురోగతికి ఎంతో సహకారాన్ని అందించాయని నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కొనియాడారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్‌లో 13వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1100 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో డిగ్రీ సర్టిఫికెట్లను అందుకున్నారు. వారిని ఉద్దేశించి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. 

సమాజానికి మీ సహకారం ఎంతో అవసరం

విజయాలు మనం తీసుకునే పట్టా సర్టిఫికెట్‌లో ఉండదని, మనం సమాజానికి ఇచ్చే సహకారంలో చూపుతోందని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని, కొవిడ్ వంటి విపత్కరమైన సందర్భాల్లో ఐఐటీ విద్యార్థులు, రీసెర్చ్ బృందం అందించిన తమ సహకారాన్ని ఎన్నడూ దేశం మరచిపోదని కొనియాడారు. వికసిత్ భారత్ లో భాగంగా 2024 నాటికి ప్రపంచంలోనే దేశ ఎకానమీ రెండో స్థానంలో నిలిచేలా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పారు. ఎక్కడా లేనివిధంగా భారతదేశంలో 45 కోట్ల మంది విద్యార్థులకు 15 లక్షల మంది ఫ్యాకల్టీలు ఉండి ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం, విద్యాభివృద్ధిలో దూసుకుపోవడం గొప్ప విషయం అన్నారు. ఉద్యోగాలు కోరుకునే విద్యార్థుల నుంచి ఉద్యోగాలు సృష్టించే వారిగా ఐఐటీఎన్లు నిలుస్తుండడం మంచి పరిణామం అన్నారు. 2008లో స్థాపించిన ఐఐటీ హైదరాబాద్ అతి తక్కువ కాలంలోనే వాటి ర్యాంకింగ్‌లో పదో స్థానంలో నిలిచింది అని చెప్పారు.

అనంతరం డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఇక్కడి క్యాంపస్లో సెమీ కండక్టర్ ట్రైనింగ్ నిర్వహించామని, ఇందులో 620 మంది విద్యార్థులు ఎంట్రీలు సాధించారని తెలిపారు. ఇంటర్ స్పోర్ట్స్ మీట్‌లో కూడా ఇక్కడ విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు.

గోల్డ్ మెడల్ సాధించిన నలుగురు విద్యార్థులు

ఐఐటీ 13వ స్నాతకోత్సవంలో భాగంగా ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసిన మామిత ప్రజ్ఞ ప్రెసిడెన్షియల్ ఇండియా మెడల్ అవార్డు అందుకోగా, తన్మై దత్త, భారతి డిఆర్, అనిరుద్ శ్రీనివాసున్ లు బంగారు పథకాలను అందుకున్నారు. వీరితోపాటు పలువురు విద్యార్థులు వెండి, ఇతర పథకాలు, పట్టాలను అందుకున్నారు. ఐఐటీ క్యాంపస్ ఆవరణలో పట్టాలు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అక్కడ వాతావరణం సంబురంగా మారింది.

 


Similar News