చార్మినార్‌ చూడటానికి వెళ్తే కనిపించదంట! విదేశీ టూరిస్ట్‌ల ముందు పరువు పోతుంది! ఓ నెటిజన్ ఆవేదన

చార్మినార్‌ను చూడ్డానికి వెళ్తే అక్కడ అది కనిపించదంట. ఎందుకంటే ఈ మధ్య చార్మినార్ పరిసర ప్రాంతాలు పూర్తిగా చిరు ప్యాపారులతో నిండిపోయింది.

Update: 2024-05-30 14:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చార్మినార్‌ను చూడ్డానికి వెళ్తే అక్కడ అది కనిపించదంట. ఎందుకంటే ఈ మధ్య చార్మినార్ పరిసర ప్రాంతాలు పూర్తిగా చిరు ప్యాపారులతో నిండిపోయింది. దీంతో పర్యాటకులకు కనీసం నడిచే దారి లేకుండా పోయిందని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి ట్యాగ్ చేశారు. చార్మినార్ ముందు డెవలప్మెంట్ అని చేశారని, వ్యాపారుల కోసం అది డెవలప్‌ చేసినట్లు ఉందని రమేశ్ వైట్ల అనే నెటిజన్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే పోలీస్ అండ్ జీహెచ్ఎంసీ ఆఫీసర్ కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నారని విమర్శించారు. విదేశీ టూరిస్ట్‌లు పెద్ద సంఖ్యలో వస్తారని, కానీ అక్కడ ప్లేస్ లేనదన్నారు.

ఇదివరకు చార్మినార్ బస్ స్టాండ్ వద్ద నుంచి నిలబడి చూస్తే చార్మినార్ క్లియర్ గా కనబడేదని, ఇప్పుడు ఫోటో దిగుదామంటే కూడా ఈ చిరు వ్యాపారులు వచ్చి పక్కకు జరుగు అంటున్నారని తెలిపారు. చార్మినార్ శాన్ పోయిందని అభిప్రాయపడ్డారు. ఖాళీ ప్లేస్ అనేది లేకుండా పోయిందన్నారు. అక్కడ అన్ని ప్లేస్ కబ్జా చేసి బండ్లు పెట్టుకున్న వాళ్లకు ఒక్క సిస్టమ్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇది వరకు యూనాని అండ్ మక్కా మసీద్ గోడకు ఆనుకుని బండ్లు పెట్టుకునే వాళ్ళని, ఇప్పుడు కూడా అలా పెట్టేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఎంట్రీ దగ్గర పోలీస్‌లు నిఘా లేదని ఆరోపించారు. ఒక్కసారి అధికారులు మంది మార్బలం వదిలి ఒంటరి సాధారణ మనుషుల మాదిరిగా వెళ్లి చూడాలని, మరొక సారి చార్మినార్‌కు వెళ్లారు అని, విదేశీ టూరిస్ట్ ముందు మన పరువు పోతుందని ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

Tags:    

Similar News