Minister Seethakka : తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : మంత్రి సీతక్క

తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే అన్నారు మంత్రి సీతక్క(Minister Seethakka).

Update: 2024-12-14 13:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే అన్నారు మంత్రి సీతక్క(Minister Seethakka). నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ రంజిత్‌(Journalist Ranjith)పై నటుడు మోహన్‌బాబు(MohanBabu) దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. రంజిత్‌ వైద్య ఖర్చులు మోహన్‌బాబు భరించాలని, వారి కుటుంబానికి అండగా ఉండాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో జర్నలిస్ట్‌లపై దాడులకు చోటు లేదని, జర్నలిస్ట్‌ల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, శిక్ష పడాల్సిందే అని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు. కాగా కుటుంబ వివాదం నేపథ్యంలో వార్తను కవర్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళిన పలువురు జర్నలిస్టులపై మోహన్‌బాబు తీవ్రంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రంజిత్ అనే జర్నలిస్ట్ తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్ట్ దానిని కొట్టివేసింది. 

Tags:    

Similar News