సరైన చర్యలు తీసుకోకుంటే సర్వనాశనమే.. కేఏ పాల్ సంచలన వీడియో

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు (Chilukuru Balaji Temple priest) రంగరాజన్ (Rangarajan) పై దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanti Party President KA Paul) తీవ్రంగా ఖండించారు.

Update: 2025-02-11 05:42 GMT
సరైన చర్యలు తీసుకోకుంటే సర్వనాశనమే.. కేఏ పాల్ సంచలన వీడియో
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు (Chilukuru Balaji Temple priest) రంగరాజన్ (Rangarajan) పై దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanti Party President KA Paul)  తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు (Actions) తీసుకోవాలని డిమాండ్ (Demand) చేశారు. అంతేగాక చర్యలు తీసుకోకుంటే సర్వనాశనమేనని అన్నారు. ఘటనపై ఆయన స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై 22 మంది దుండగులు వెళ్లి దాడి చేయడం దారుణమని అన్నారు.

ఈ మధ్య కాలంలో చర్చిల్లోకి, మసీదుల్లోకి వెళ్లి దాడులు చేయడం పెరిగిపోయాయని అన్నారు. అలాగే రామరాజ్యం సైనికులు (Ramarajyam soldiers) రాముడి పేరుతో వెళ్లి రంగరాజన్ అనే పూజారిపై దాడి చేయడం దారుణం అని మండిపడ్డారు. నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసి, జైల్లో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక సరైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి దాడులు తగ్గుతాయని, లేదంటే ఈ దేశం సర్వనాశనం అవుతుందని తెలిపారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తక్షణమే డీజీపీ (DGP) ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు ఎక్కడా జరగకూడదని, జరిపిన వారికి సరైన శిక్ష విధిస్తే.. ఇలాంటివి అరికట్టవచ్చని అన్నారు.

లేదంటే దేశంలో శాంతి లేకుండా అయిపోతుందని కేఏ పాల్ చెప్పారు. కాగా కొద్ది రోజుల క్రితం చిల్కూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో ఓ మూక ఆయనపై దాడి చేశారు. దీనిపై ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఘటనపై హిందువాదులు, ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజారి పై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూజారిపై దాడి ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

Tags:    

Similar News