BJP : అదానీ అవినీతిపరుడైతే రేవంత్ రెడ్డి 100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు? : బీజేపీ

అదానీ ఒక అవినీతిపరుడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పదేపదే ఆరోపిస్తుంటారని, అదే నిజమైతే, అదానీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారని బీజేపీ ( BJP)జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా(Sambit Patra)ప్రశ్నించారు.

Update: 2024-11-21 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : అదానీ ఒక అవినీతిపరుడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పదేపదే ఆరోపిస్తుంటారని, అదే నిజమైతే, అదానీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారని బీజేపీ ( BJP)జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా(Sambit Patra)ప్రశ్నించారు. దావోస్‌లో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని నిలదీశారు. ఆ సంస్థతో 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది. గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారని, నరేంద్రమోడీతో చేతులు కలిపారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం మీడియా సమావేశంలో కౌంటర్ ఎటాక్ చేశారు.

అదానీ గ్రూప్ పై అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని, ఆ సమయంలో ఛత్తీస్ గఢ్, తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షమే అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. 2021-2023 మధ్య రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలుగా 265 మిలియన్ డాలర్లు చెల్లించిందని యూస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. యూఎస్ నేరారోపణ చేసిన రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్, తమిళనాడుతో పాటు ఒడిశా నవీన్ పట్నాయక్ పాలనలో, ఏపీలో వైఎస్ జగన్ పాలనలో ఉన్నాయని నంబిత్ పాత్రా వెల్లడించారు. భారతదేశాన్ని రక్షించే నిర్మాణాలపై దాడి చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యూహమని ఆరోపించారు. రాహుల్ గాంధీ 2019లో ఇదే తరహాలో రాఫెల్ సమస్యని లేవనెత్తారని, కోవిడ్ సమయంలో వాక్సిన్ పనితీరుని ప్రశ్నించారని.. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.

కాగా అమెరికాలో బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని అమెరికా ఎఫ్ బీఐ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను ఆదానీ గ్రూప్ ఖండించింది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ గౌతమ్ అదానీ అమెరికా, భాతర చట్టాలను ఉల్లంఘించారని పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) వేసి విచారించాలని, ఆదానీ, ప్రధానీ మోడీ బంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదానీని మోడీనే కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ మధ్యే కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అదానీ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి..దీనిపై కూడా విచారణ జరగాలా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ తప్పకుండా విచారణ జరగాలని..అదానీని అరెస్టు చేయాలి..ఇతరులు ఎవరున్నా వారిని కూడా అరెస్టు చేయాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News