Jeevan Reddy : నేనెవరికి తలొగ్గను : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Former MLC Jeevan Reddy).

Update: 2025-04-01 11:52 GMT
MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Former MLC Jeevan Reddy). పార్టీలో దశాబ్దాల తరబడి పని చేస్తున్న వారిని కాదని, నిన్న గాక మొన్న వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మారిన వారితోనే ప్రచారం చేయించుకోవాలని, వారే నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలని ఎద్దేవా చేశారు. తాను ఎవ్వరికీ తలొగ్గను అని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. తాను పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని, ఎంతో కష్టపడ్డాను అని.. సొంత కష్టంపై ఇంతదాకా వచ్చిన వాడిని అన్నారు. అలాంటి తాను ఎన్నటికీ ఇంకొకరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏది తప్పో ఒప్పో బహిరంగంగా చెప్పే హక్కు తనకు ఉందని, తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్చ ఎప్పటికీ ఉంటుందని, తన గొంతు నొక్కేయాలని చూడటం ఎవ్వరితరం కాదన్నారు. కాగా బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నో దశాబ్దాలుగా నియోజక వర్గాన్ని కాపాడుతుంటే.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూడటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పలుమార్లు బహిరంగాగానే రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించారు.   

Tags:    

Similar News