HYD: రాంనగర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన

ముషీరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పర్యటించారు. మణెమ్మ గల్లీలోని నాలాలను ఆక్రమించారని కమిషనర్‌కు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు.

Update: 2024-08-28 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముషీరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పర్యటించారు. మణెమ్మ గల్లీలోని నాలాలను ఆక్రమించారని కమిషనర్‌కు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం స్వయంగా రంగనాథ్ రాంనగర్‌లో పర్యటించారు. ఈ సదర్భంగా అక్కడ స్థానికులతో మాట్లాడారు. స్థల పత్రాలను పరిశీలించాలని అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, హైదరాబాద్‌లో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రాంనగర్ లాంటి ఇరుకు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నాలాలను ఆక్రమించడంతో వర్షం పడినప్పుడల్లా పరిస్థితి దారుణంగా మారుతోందని.. తక్షణమే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు.


Similar News