ఆపరేషన్ రోప్ ఏమైనట్టు.. ఆరంభ శూరత్వానికే పరిమితమా?

మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించటంతో పాటు ఫుట్‌పాత్ ఆక్రమణలను నివారించేందుకు నగర పోలీసులు ఇటీవల చేపట్టిన ఆపరేషన్ రోప్ కేవలం ప్రారంభానికే పరిమితమైంది.

Update: 2023-05-22 05:01 GMT

దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించటంతో పాటు ఫుట్‌పాత్ ఆక్రమణలను నివారించేందుకు నగర పోలీసులు ఇటీవల చేపట్టిన ఆపరేషన్ రోప్ కేవలం ప్రారంభానికే పరిమితమైంది. గత సంవత్సరం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తొలుత రెండు, మూడు రోజుల పాటు ట్రాఫిక్, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, జంక్షన్లలో నిర్వహించి మమ అనిపించారు. ముఖ్యంగా ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు నకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ఎదురయ్యే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు ఆదిలోనే ఈ కార్యక్రమానికి మంగళం పలికినట్లు వాదనలున్నాయి.

ఫలితంగా మహానగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా కొత్త సచివాలయం ప్రారంభించిన తర్వాత, సాగర తీరాన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన అనంతరం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం చౌరస్తా, లిబర్టీ సర్కిల్‌తో పాటు ఆదర్శ్ నగర్, ఇక్బాల్ మినార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసం మార్పులు చేసిన పోలీసులు ఆ మార్పుల వల్ల ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న వాదన ఉంది.

అక్రమ పార్కింగ్‌లపై చర్యలేవీ?

మహానగరంలో రోజురోజుకి అక్రమ పార్కింగ్‌లు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా రానున్న 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన జీహెచ్ఎంసీ రోడ్డు విస్తరణ చేపడుతుంటే రోడ్డుకి ఇరువైపులా సగం రోడ్డు వరకు అక్రమ పార్కింగ్‌లు వెలుస్తున్నాయి.

Tags:    

Similar News