Hyderabad : కార్లు, బైకులు కడుగుతున్నారా.. అయితే భారీ ఫైన్ తప్పదు

కార్లు, బైకులు బాగా దుమ్ముపట్టి పోయాయని వాటిని కడిగే పని పెట్టుకుంటున్నారా? అయితే అలాంటివి చేస్తే ఇకపై మీకు భారీగా జరిమానా పడనుంది.

Update: 2025-03-16 14:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్లు, బైకులు బాగా దుమ్ముపట్టి పోయాయని వాటిని కడిగే పని పెట్టుకుంటున్నారా? అయితే అలాంటివి చేస్తే ఇకపై మీకు భారీగా జరిమానా పడనుంది. అదేంటి అనుకుంటున్నారా.. హైదరాబాద్‌లో ఈ సమ్మర్ లో భారీగా నీటి కరువును ఎదుర్కోబోతుంది. ప్రతినీటి బొట్టును జాగ్రత్తగా కాపాడుకోవడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా అయితేనే నగర ప్రజలకు తాగునీటిని అందించగలమని యోచిస్తోంది. నీటిని జాగ్రత్తగా కాపడుకోవడమే కాదు, వృథాను అరికట్టడానికి నడుం బిగించింది. అయితే నగరంలో పలు ఇళ్ళకు సరఫరా చేస్తున్న తాగునీటిని కొంతమంది కార్లు, బైకులు కడుగుతుండటం జలమండలి దృష్టికి వచ్చింది.

అలా తాగునీరు వృథా చేస్తున్న వారిపై ఆదివారం అధికారులు కొరడా జులిపించారు. జూబ్లీహిల్స్ డివిజన్‌-6లోని ఇళ్ళల్లో జలమండలి అధికారుల తనిఖీలు నిర్వహించారు. తాగునీటితో తాగునీటితో బైక్‌, కార్లు కడుగుతున్న కొంతమందిని గుర్తించి, నీరు వృథా చేస్తున్నందుకు రూ.1000 ఫైన్ వేశారు. ఇకపై జలమండలి విరివిగా తనిఖీలు చేపడుతుందని, ఎవరైనా నీరు వృథా చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే జరిమానా విధించడమే కాకుండా మరోసారి అలాగే చేస్తే నీటి కనెక్షన్ శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

READ MORE ...

ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే, జూన్ ల పరిస్థితేంటి రేవంత్..? కేఏ పాల్ సంచలన వీడియో


Tags:    

Similar News