మోడీ అన్ని అబద్ధాలే చెప్పారు: కిరణ్ కుమార్ రెడ్డి

దేశ ప్రధాని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో 2014 కంటే ముందు భారతదేశంలో ప్రజలు చాలా కష్టాలను , ఆటుపోట్లను ఎదుర్కొన్నారని అన్ని అబద్ధాలు చెప్పారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ...

Update: 2023-09-05 16:38 GMT
  • గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరం
  • 65 ఏళ్ల పరిపాలనలో ఎంతో అభివృద్ధి
  • చరిత్రని తప్పుదోవ పట్టించడం తగదు
  • 9 ఏళ్ల పాలనలో 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రధాని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో 2014 కంటే ముందు భారతదేశంలో ప్రజలు చాలా కష్టాలను , ఆటుపోట్లను ఎదుర్కొన్నారని అన్ని అబద్ధాలు చెప్పారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014 తర్వాతనే 200 కోట్ల మంది నైపుణ్యాలను తయారు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. 65 ఏళ్ల పరిపాలనలో అటల్ బిహారీ వాజపేయి, లాల్ బహుదూర్ శాస్త్రి ఇంకా ఎంతోమంది పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ గొప్ప నాయకులు ఎంతోమంది భారతదేశాన్ని పరిపాలించారన్నారు. వారి పాలనలో ఎన్నో విద్యాసంస్థలు, చాలా యూనివర్సిటీలు నైపుణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది శాస్త్రవేత్తలను అందించిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

గతంలో రాహుల్ గాంధీ ఒక బ్రిటిష్ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు భారతదేశంలోప్రజాస్వామ్యం పట్టాలు తప్పిందని అంటే మోదీ తప్పుబట్టిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీ జి 20 సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని 2014 ముందు ఆకలితో ఉన్న భారతదేశం అని చెప్పిన మోడీని ఏమనాలి? అని అయన ప్రశ్నించారు. చరిత్రను తప్పుదోవ పట్టిస్తూ చరిత్రను తిరగరాయదలుచుకున్నారా, లేకపోతే ప్రపంచ దేశాలకు బీజేపీ వచ్చిన తర్వాతే భారతదేశంలో ఇవన్నీ వచ్చాయని చెప్పదలుచుకున్నారా? అని ఆయన నిలదీశారు. 2014లో అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసారని విమర్శించారు. 9 ఏళ్ల పాలనలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, మరి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో తెలపాలని ఆయన డిమాండ్ చేసారు . మోడీ పరిపాలనలో ఆయన మిత్రులు ఆదానీ, అంబానీ కోట్లకు పడగలెత్తారే తప్ప భారత దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు 


Similar News