బీఆర్ఎస్ లో కట్టప్పలున్నారు.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అందరితో కలిసి మెలిసి తిరుగుతూ పార్టీలోని అంతర్గత విషయాలను ఇతర పార్టీలకు చెప్పుతూ పబ్బం గడుపుకుంటున్న తమ పార్టీలో కూడా కట్టప్పలు ఉన్నారని, వారి భరతం పడతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హెచ్చరించారు.
దిశ, ఎల్బీనగర్ : బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అందరితో కలిసి మెలిసి తిరుగుతూ పార్టీలోని అంతర్గత విషయాలను ఇతర పార్టీలకు చెప్పుతూ పబ్బం గడుపుకుంటున్న తమ పార్టీలో కూడా కట్టప్పలు ఉన్నారని, వారి భరతం పడతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలుబడిన అనంతరం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నాపై నమ్మకంతో ఓట్లు వేసి నన్ను గెలిపించిన ఎల్బీనగర్ ప్రజలందరికీ, నా గెలుపు కోసం సైనికులుగా కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నుండి మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, మొదట ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పెద్ద పెద్ద లీడర్లు తన వెనకాల ఉండే అప్పుడు 13 వేల మెజార్టీతో గెలుపొందానన్నారు. రెండోసారి చాలామంది లీడర్లు వెళ్లిపోయినారు అప్పుడు 18 వేల మెజార్టీతో విజయం సాధించానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీలో కట్టప్పలు చాలామంది ఉన్నారు. అయినా కూడా 20 వేల పైనే మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో గెలిచానని, ఈ గెలుపు తనది కాదని ప్రజలదని తన గెలుపు ప్రజలకే అంకితం చేస్తూనాన్నని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న కట్టప్పలను త్వరలోనే గుర్తించి తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు.