Breaking: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ విద్యార్థి నేతల ఆందోళన

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది..

Update: 2024-09-15 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు (BRS Student wing Leaders) ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. మంత్రుల క్వార్టర్లను ముట్టడించేందుకు యత్నించారు. తెలంగాణ (Telangana)లో వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ (Medical Counseling) నిర్వహించాలని డిమాండ్ చేశారు.


తెలంగాణలో నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు (MBBS Steats) ఇవ్వొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్న వేళ ఆందోళన చేపట్టడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకున్నారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 


Similar News