గోవా టూ హైదరాబాద్ కి కొకైన్ విక్రయిస్తున్న షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ అరెస్ట్
వృత్తి షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ చేసేది మాత్రం డ్రగ్స్ వ్యాపారం. షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ డ్రగ్స్ అమ్మి రెండు చేతుల డబ్బులు
దిశ, జూబ్లీహిల్స్ : వృత్తి షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ చేసేది మాత్రం డ్రగ్స్ వ్యాపారం. షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ డ్రగ్స్ అమ్మి రెండు చేతుల డబ్బులు సంపాదించాలని చివరకు డ్రగ్స్ అమ్ముతూ ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కృష్ణా నగర్ కి చెందిన సయ్యద్ అజర్ హష్మీ షార్ట్ ఫిల్మ్ ఫోటో గ్రాఫర్ గా పని చేసేవాడు. అతనికి బంజారాహిల్స్ కి చెందిన మగపు క్రాంతి కుమార్ అనే వ్యక్తి స్నేహితుడు. ఇద్దరు కలిసి గోవా నుండి అక్రమంగా కొకైన్ ను అక్రమంగా తరలించి, విక్రయిస్తున్నారు. గురువారం, మధ్యాహ్నం 2 గంటల సమయంలో జూబ్లీహీల్స్ రోడ్డు నెం. 7లో సయ్యద్ అజర్ హష్మీ, మగపు క్రాంతికుమార్ ఇద్దరు వ్యక్తులు గోవా నుంచి తెచ్చిన కోకైన్‌ను విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్.టి.ఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి 11.5 గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు రెండు స్కూటీలను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎక్సైజ్ అధికారులకు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు తో పాటు స్వాధీనం చేసుకున్న కొకైన్, స్కూటీలను, రెండు సెల్ ఫోన్లను అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు. సయ్యద్ అజర్ హష్మీ పై దబీర్‌పురా పోలీస్ స్టేషన్ 2023 లో ఇది వరకే డ్రగ్స్ కేసు నమోదైంది అని పోలీసులు తెలిపారు. గోవా నుంచి ఒక గ్రాము కోకైన్ ను రూ. 6 వేలకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 14 వేలకు గ్రాము చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు నిందితుల విచారణలో తెలుపారని పోలీసులు వెల్లడించారు.