ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఆర్ఓ లక్ష్మీనారాయణ
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వి.లక్ష్మీనారాయణ తెలిపారు.
దిశ, ముషీరాబాద్ : ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వి.లక్ష్మీనారాయణ తెలిపారు. 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 1 వేయి 788 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1 లక్షా 46 వేల 607 మంది మహిళా ఓటర్లు, 1 లక్షా 55 వేల 168 మంది పురుష ఓటర్లు, ఇతరులు 13 మంది ఉన్నారని చెప్పారు.
వీరందరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 105 పోలింగ్సెంటర్లలో 289 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశామనితెలిపారు. 1500 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వారికి ఈవీఎంలతో పాటు ఎన్నికల నిర్వహణకు కావలసిన సామాగ్రి అప్పగించారని చెప్పారు. ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది పోలింగ్‌బూత్‌ల వద్ద విధినిర్వహణలో ఉంటారన్నారు. 289 ఈవీఎంలతో, 91 ఈవీఎంలు ఎక్స్ట్రా ఉంటాయని తెలిపారు. 12 సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు ఉన్నయని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆర్ఓ తెలిపారు.