Rachakonda : ఆ విభాగంలో డ్యూటీకి మాకు అవకాశం ఇవ్వండి...స్పెషల్ బ్రాంచ్ లో 'రీఎంట్రీ'..

రీ - ఎంట్రీ.. ఇది ఆటలోని మాట కాదు పోలీస్ విభాగం లోని

Update: 2024-11-02 07:24 GMT

దిశ, సిటీ క్రైమ్ : రీ - ఎంట్రీ.. ఇది ఆటలోని మాట కాదు పోలీస్ విభాగం లోని స్పెషల్ బ్రాంచ్ లో కొంత మంది ఉద్యోగుల విధుల పై తలెత్తిన వివాదం ఇది. ఈ విధంగా పలుకు బడి తో స్పెషల్ బ్రాంచ్ లోనే తిష్ట వేసి కూర్చున్న కొంత సిబ్బంది తీరుతో మిగతా పోలీస్ అధికారులు ఇబ్బంది పడుతున్న వ్యవహారంలోని అసంతృప్తి ఇది. ఈ విధంగా పోలీస్ వర్గాల్లో ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ లో రీ ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది.

ఆరోపణలు ఎదురుకున్న అక్కడే పోస్టింగ్ ..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న వారిలో కొంత మంది దాదాపు 6 సంవత్సరాల పై నుంచి వివిధ హోదాల్లో తిష్ట వేసుకుని స్పెషల్ బ్రాంచ్ లోనే ఇంకా ఉన్నారు. ఇందులో కొంత మంది పై ఆరోపణలు వచ్చి ఉన్నతాధికారుల చర్యలకు గురై స్వల్పంగా కొన్ని రోజుల పాటు ఈ విభాగం నుంచి బయటకు వెళ్లిన తిరిగి ఈ బ్రాంచ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి విధులు నిర్వహిస్తున్నారని రాచకొండ పోలీస్ వర్గాల్లోనే విమర్శలు ఉన్నాయి. రీ ఎంట్రీ, సంవత్సరాల నుంచి ఈ విభాగం లోనే పనిచేస్తున్న వారు 40 నుంచి 60 శాతం వరకు ఉంటారని తోటి పోలీసులే ఆరోపిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతులు పొంది ఇక్కడే పోస్టింగులు నిర్వహిస్తున్న వైనం తోటి సిబ్బందినే పరేషాన్ చేస్తున్నాయి...

మిస్సింగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద ఫోకస్..

స్పెషల్ బ్రాంచ్ లో పని చేసే ఆఫీసర్స్, సిబ్బంది పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనిచేసే తీరు నుంచి స్థానికంగా ఉన్న పరిస్థితులు, ప్రజా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు, రాజకీయంగా చోటుచేసుకుంటున్న మార్పులు ఇంకా పోలీస్ విభాగానికి ఉపయోగపడే కీలక సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తుంటారు. అదే విధంగా పాస్ పోర్టు, మిస్సింగ్ డాకుమెంట్స్, జాబ్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తదితర విషయాలకు సంబంధించిన ఎంక్వయిరీ చేసి నివేదికను పీఎస్ అధికారులకు ఇస్తారు. ఈ ఎస్బీ నివేదిక ఆధారంగా సర్టిఫికెట్ లను జారీ చేస్తారు. అయితే ఇలా ఎస్బీ లో దీర్ఘకాలంగా కొంత మంది తిష్ట వేయడం తో వారు ఈ ఎంక్వయిరీ లో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ మిస్సింగ్ డాకుమెంట్స్ లలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎక్కువ శ్రద్దా చూపిస్తారానే విమర్శల తో పాటు వీటి నివేదికకు లక్షల్లో డబ్బులు చెల్లించేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండటం తో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఇలాంటి విచారణ ల పై ఎక్కువ ఫోకస్ పెడతారని పోలీస్ వర్గాల్లోనే చర్చ ఉంది. దీనికి ఈ విభాగం లో సుదీర్ఘంగా కొంత మంది పనిచేస్తుండడమే ప్రధాన కారణం అంటున్నారు.ఈ కారణంగా పలు సందర్భాల్లో పోలీస్ ప్రతిష్ట దెబ్బతింటుందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. దీంతో కొత్త వారికి పనిచేసేందుకు స్పెషల్ బ్రాంచ్ లో అవకాశం ఇవ్వాలనే వాయిస్ పోలీస్ వర్గాల్లో పెరుగుతుంది.

Tags:    

Similar News