వాహనదారులకు భారీ శుభవార్త.. అర్ధరాత్రి నుంచి అమలుల్లోకి తగ్గింపు రేట్లు

వాహనదారులకు టోల్ ఫీజు తగ్గింపు ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది..

Update: 2025-03-31 15:51 GMT
వాహనదారులకు భారీ శుభవార్త..  అర్ధరాత్రి నుంచి అమలుల్లోకి తగ్గింపు రేట్లు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: వాహనదారులకు శుభవార్త. ఉగాది పండుగ వేళ అదిరే గుడ్ న్యూస్ లభించింది. ఇకపై హైదరాబాద్​నుండి విజయవాడ వెళ్లే వారికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (ఎన్​హెచ్​-65)పై ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజులను తగ్గిస్తున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ ) ప్రకటించింది. సవరించిన టోల్ రేట్లు నిన్న మార్చి 31 , 2025 అర్ధరాత్రి నుండి అంటే నేడు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు 2026 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఈ హైవేలో మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని చిలకల్లు ఉన్నాయి. కాగా తగ్గించిన టోల్ ఫీజులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పంతంగి టోల్ ప్లాజా: కార్లు, జీపులు, వ్యాన్లు: ఒక వైపు ప్రయాణానికి రూ. 15; తిరుగు ప్రయాణానికి రూ. 30. అదే తేలికపాటి వాణిజ్య వాహనాలు అయితే ఒక వైపుకు రూ. 25, రౌండ్ ట్రిప్ కు రూ. 40. ఇక బస్సులు , ట్రక్కులు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ. 50, రౌండ్ ట్రిప్ కు రూ. 75 వసూలు చేస్తారు

అటు ఏపీలోని చిలకల్లు టోల్ ప్లాజా: అన్ని వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 5; రౌండ్ ట్రిప్ లకు కు రూ. 10, అదనంగా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేసే వాహనాలకు అన్ని వాహనాల్లో టోల్ ఫీజులపై 25 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఓఆర్​ఆర్​టోల్ ​ఛార్జీలపై స్పందించండి.. ప్రభుత్వానికి ఇసుక లారీ యజమానుల సంఘం వినతి


ఒక దిక్కు జాతీయ రహదారులపై టోల్ ఫీజులు తగ్గించడం శుభపరిణామం అని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔటర్​రింగ్​రోడ్​పై టోల్ చార్జీలు భారీగా ఉన్నాయని, వీటిని కూడా తగ్గించాలన్నారు. ఇప్పటికే దేశంలో రవాణా రంగం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల గూడ్స్ వాహనాల రవాణా రంగం రోజురోజుకు నిర్ణీర్యమవుతోందన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై భారీ వాహనాలకు కిలోమీటర్ 70 పైసలు పెంచుతామన్న వార్తలు వస్తున్నాయని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశంలో రవాణా రంగాన్ని బలోపేతం చేయనికి కాలం తీరిన టోల్ గేట్లను ఎత్తివేసి టోల్ ఫీజులు రేట్లు పెంచకుండా చర్యలు చేపడితే మంచిదన్నారు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని కృషి చేస్తేనే దేశం బాగుపడుతుంది సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.

Similar News