Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్‌పై పోలీసుల వివరణ
అల్లు అర్జున్(Allu Arjun) ను అరెస్ట్ చేసిన విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు వివరణ ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్(Allu Arjun) ను అరెస్ట్ చేసిన విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. దుస్తులు మార్చుకుంటానంటే, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు చాలా సమయం ఇచ్చామని పేర్కొన్నారు. అతను బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నామని, అర్జున్ తానే స్వయంగా పోలీసు వాహనంలో కూర్చున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ(South Central DCP) మీడియాకు వివరించారు. పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
కాగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ను నేడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station)లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి, గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. కోర్ట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు కొట్టి వేయాలని హైకోర్టు(High Court)లో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read :
Rashmika Mandanna:‘చాలా బాధ కలుగుతోంది’.. బన్నీ అరెస్ట్ పై స్పందించిన నేషనల్ క్రష్ రష్మిక