రోడ్డు విస్తరణ కు అడ్డుగా ఉన్న పది నిర్మాణాలు కూల్చి వేసిన అధికారులు
జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు రోడ్డు విస్తరణ పనులను మంగళవారం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు బృందం పరిశీలించారు.
దిశ, చార్మినార్ : జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు రోడ్డు విస్తరణ పనులను మంగళవారం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు బృందం పరిశీలించారు. తాడ్బన్ వద్ద రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పది నిర్మాణాలను తొలగించారు. ఈ పనులను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు తో పాటు సౌత్ జోన్ సిటీ ప్లానర్ మజీద్, ఫలక్ నుమ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారి కెఎన్ మెహ్రా, సర్కిల్ అధికారి మహేందర్, ప్రాజెక్ట్ ఏఈ ఫైసల్ లు ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు.