Case File : ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన వాహనదారుడు..

తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పై వాహనదారుడు

Update: 2024-10-29 11:26 GMT

దిశ, జూబ్లీహిల్స్: తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పై వాహనదారుడు వాగ్వాదం చేస్తూ , బూతులు తిట్టడం తో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 సమీపంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఇద్దరు జంట వస్తుండగా పోలీసులు తనిఖీ చేస్తూ వాహనం పై చలాన్ వుంది, వాహనదారుని బైక్ తాళం తీసుకుని, చలాన్ కట్టాలని కోరగా వాహనదారుడు పోలీసులు తో వాగ్వాదానికి దిగాడు. దొంగ పోలీసులు , ఇష్టానుసారంగా చలాన్ లు వేస్తున్నారు. తాళం ఇస్తారా ఇవ్వరా..? ఫైన్ వేసుకోండి, బైక్ తాళం తీసుకోమని పోలీసులుకు ఎవరిచ్చారు హక్కు అని బూతు పురాణం మొదలు పెట్టాడు. తన బైక్ ను కింద పడేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అని గొడవ చేశాడు. ఈ ఘటన పై ట్రాఫిక్ పోలీసులు , లాండ్ ఆర్డర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా , వాహనదారుడి నీ అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఆటంకం కలిగించి, బూతులు తిట్టిన నెపంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News