మందకృష్ణ మాదిగ మతతత్వ శక్తి పార్టీతో చేతులు కలిపి మాదిగ జాతికి మోసం చేశారు

వర్గీకరణపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మతతత్వ శక్తి పార్టీతో చేతులు కలిపి మాదిగ జాతికి మోసం చేసారని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-07-07 15:26 GMT

దిశ, రవీంద్రభారతి : వర్గీకరణపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మతతత్వ శక్తి పార్టీతో చేతులు కలిపి మాదిగ జాతికి మోసం చేసారని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ దండోరా 30 సంవత్సరాల ఆవిర్భావ సదస్సు ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ

మతతత్వ పార్టీలో ఇరుకొని ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న మాదిగలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. మాదిగలంటే ముఖ్యమంత్రి కి అపారమైన ప్రేమ ఉందన్నారు. గత 75ఏళ్లుగా సీఎం పేషిలో ఒక ఐఎఎస్, ఐపీఎస్ అధికారి లేరని..కానీ ముఖ్యమంత్రి రేవంత్ నియంమించారని, ఈ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే వర్గీకరణ చేస్తానని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు అన్నిరంగాల్లో మోసం చేసారని ధ్వజమెత్తారు.

ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన రాజయ్యను తొలగించి తీవ్ర అన్యాయం చేసారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. మేడి పాపయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరుణోదయ సమాఖ్య వ్యవస్థాపకురాలు విమలక్క, పలువురు మాదిగ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News