ఓల్డ్ సిటీలో అదుపు తప్పిన శాంతి భద్రతలు..!! జర్నలిస్ట్‌పై అల్లరిమూకల దాడి
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్లభించడం పట్ల మజ్లిస్‌పార్టీ నాయకులు, ముస్లిం శ్రేణులు మంగళవారం అర్థరాత్రి నుంచి పాతబస్తీ చార్మినార్పరిసర ప్రాంతాలలో ఆందోళన ఉదృతం చేశారు.
దిశ, చార్మినార్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్లభించడం పట్ల మజ్లిస్‌పార్టీ నాయకులు, ముస్లిం శ్రేణులు మంగళవారం అర్థరాత్రి నుంచి పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఆందోళన ఉదృతం చేశారు. చార్మినార్, మూసాబౌళి, సిటీ కాలేజ్, షాలిబండా, అలియాబాద్, లాల్‌దర్వాజా మోడ్నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించారు.
మూసాబౌళి నుంచి సిటీకాలేజ్వద్ద పలువురిపై అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. సిటీ కాలేజ్ నుంచి గోషామహల్‌కు వెళ్ళకుండా సిటీ కాలేజ్వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి రోడ్డును క్లోజ్ చేశారు. సౌత్జోన్డీసీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో సిటీ కాలేజ్వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద అల్లరిమూకలు పోలీసుల పైకి రాళ్లతో దాడులు చేశారు. అక్కడే న్యూస్ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ అక్బర్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో చార్మినార్ వద్ద శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో పలువురు అందోళన కారులకు గాయాలయ్యాయి. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో పాటు ప్రయివేట్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాలా డీసీపీ సాయిచైతన్యతో వాగ్వివాదానికి దిగారు. పదేపదే తమ మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజాసింగ్‌కు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఇంకా ఎన్ని సార్లు రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు..? డీసీపీ సాయిచైతన్య సమయ స్పూర్తితో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని నచ్చజెప్పి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎపుడు ఏం జరుగుతుందోనని పాతబస్తీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.