పంజాగుట్టలో ఘనంగా లాడియా డైమండ్ స్టోర్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!
హైదరాబాద్ పంజాగుట్టలో లాడియా డైమండ్ స్టోర్ ఘనంగా ప్రారంభమైంది..
దిశ, హైదరాబాద్: భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ షోరూం లాడియా. ఈ లాడియా ల్యాబ్‌లో రూపుదిద్దుకున్న వజ్రాభరణాలు ప్రపంచంలో ప్రత్యేకమైనవి. లాడియా ఆవిష్కరణ వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నది. వజ్రాలను అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు లాడియా కృషి చేస్తోంది. అయితే లాడియా రెండవ స్టోర్‌ను పంజాగుట్ట తేజస్వి ప్లాజాలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, జాతీయ అధికార ప్రతినిధి మధు యాష్కీగౌడ్, నటి సంయుక్త మీనన్‌తో కలసి లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ.. భారతదేశం వజ్రాల ల్యాబ్ -గ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగంలో వినూత్న ఆలోచనలతో విభిన్న ఆవిష్కరణలకు లాడియా కట్టుబడి ఉన్నాదని తెలియజేయడానికి సంతోషిస్తున్నామన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జ్యువెలరీ హబ్‌లో రెండవ స్టోర్‌ను ప్రారంభిచడం గౌరవంగా ఉందని, సహజ వనరుల నివారణ, హానికరమైన మైనింగ్ పద్ధతులను తగ్గించడం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రత్యేకత అని అఖిల్ వేములూరి తెలిపారు.
లాడియా ల్యాబ్‌లో రూపుదిద్దుకునే వజ్రాభరణాలు కచ్చితమైన నాణ్యతాప్రమాణాలతో తయారు చేయబడతాయని అఖిల్ వేములూరి చెప్పారు. ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వజ్రాభరణాలు తయారు చేస్తారని చెప్పారు. ఈ ల్యాబ్‌లో తయారు చేయబడే సహజమైన ప్రకృతి సిద్ధమైన వజ్రాభరణాలు మేలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ల్యాబ్‌లో చేయబడిన వజ్రాలు సహజ వజ్రాల వలె అదే రంగు, స్పష్టత స్థాయిని ఉపయోగించి కూడా గ్రేడ్ చేయబడినవని అఖిల్ వేములూరి తెలిపారు.
లాడియాలో తయారు చేయబడిన బంగారు వజ్ర ఆభరణాలు విస్తృత ఎంపికతో లభిస్తాయని అఖిల్ వేములూరి చెప్పారు. నెక్లెస్‌లు, బ్యాంగిల్స్, పెండెంట్‌లు, కంకణాలు, చెవిపోగులు, ఝుమ్‌కాస్, ఉంగరాలు ప్రత్యేకమైన ల్యాబ్లో పోల్కిస్, కస్టమైజేషన్-మేక్ యూరోన్ డిజైన్‌లలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. తమ వజ్రాల ఆభరణాలు డైమండ్ గ్రేడింగ్ సర్టిఫికేషన్‌లో గ్లోబల్ అథారిటీ అయిన IGl నుంచి ధృవీకరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు క్యారెట్ డైమండ్ ధర రూ. 24,999 ((EF-VVS)తో విభిన్న సేకరణలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు బీకన్ రిలేషన్స్, AJ ఈవెంట్స్ ఆర్యన్ 9573391749ను సంప్రదించాలని అఖిల్ వేములూరి కోరారు.