కేసీఆర్ కుటుంబమే తెలంగాణ ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది

సబ్బండ వర్గాల ప్రజలు కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కుంటే, సీఎం కేసీఆర్ కుటుంబమే తెలంగాణ ప్రతి ఫలాలను అనుభవిస్తుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు.

Update: 2023-04-13 13:01 GMT

దిశ, ముషీరాబాద్ : సబ్బండ వర్గాల ప్రజలు కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కుంటే, సీఎం కేసీఆర్ కుటుంబమే తెలంగాణ ప్రతి ఫలాలను అనుభవిస్తుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో 2023 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాపార్టీ 119 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుందని, బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తెలిపారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందడం లేదన్నారు. పేదల కష్టాలు తీర్చడానికే ప్రజా పార్టీ ప్రజలకు ముందుకు వచ్చిందన్నారు. ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, న్యాయాన్ని ఉచితంగానే అందిస్తామని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయిమన్నారు.

    కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్, కమ్యునిస్టు పార్టీలన్నీ అగ్రవర్ణ నాయకుల ఆధ్వర్యంలో పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెంట రమేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్, సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, నాగేష్ యాదవ్, రాగం సతీష్ యాదవ్, ప్రశాంత్, అనిల్, రవి కుమార్, వలప్ప, పలువురు ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News