కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కరపత్రం ఆవిష్కరణ
తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభలో ఇచ్చిన గ్యారంటీ ఆరు పథకాలను శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రతి గడపకు తీసుకు వెళ్లాలని రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, శేరిలింగంపల్లి : తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభలో ఇచ్చిన గ్యారంటీ ఆరు పథకాలను శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రతి గడపకు తీసుకు వెళ్లాలని రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలపై మంగళవారం మియాపూర్ లో ఏర్పాటు చేసిన నాయకుల, కార్యకర్తల సమావేశంలో నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకి ఈ అభయహస్తం పథకాల ద్వారా లబ్ధి కలుగుతుందని ఆయన తెలిపారు.
శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన, ఆదరణ కనిపిస్తుందని, రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అంకిత భావంతో కలిసి కట్టుగా పని చేస్తే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ ఇలియాస్ షరీఫ్, నడిమింటి కృష్ణ, జమీర్, మహిపాల్ యాదవ్, భరత్ గాంధీ రెడ్డి, దుర్గం శ్రీహరిగౌడ్, హరి కిషన్, అప్రొజ్ ఖాన్, ఖాజా పాషా, కమర్ పాషా, తన్విర్ బేగం, లక్ష్మీ, సోమరాజు, పద్మినీ ప్రియదర్శిని, షఫీ, ఆసీఫ్ పటేల్, గురువయ్య, శాంత, భాగ్యమ్మ, ఇస్మాయిల్, ఎస్.కే ఖాజా పాషా, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.