సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టివేత..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 24 కిలోల గంజాయి చాక్లెట్ పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన గోరక్ అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలించి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో గురువారం రాజస్థాన్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. అక్కడ నుంచి ఈ చాక్లెట్లను కూకట్పల్లిలోని ఓ షాపులో ఇచ్చేందుకు బస్సు కోసం వేచి ఉండగా, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన వద్ద 24 కిలోల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభించాయి. చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు గోరక్ను అరెస్టు చేశారు.