నగరంలో అర్ధరాత్రి భారీ వర్షం..

వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం హైదరాబాద్(Hyderabad) నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది.

Update: 2024-09-05 01:56 GMT

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం హైదరాబాద్(Hyderabad) నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రారంభం అయిన వర్షం.. తెల్లవారు జామున 3 గంటల వరకు వర్ష(Rain) కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కాగా రాత్రి.. ఉప్పల్, మల్లేపల్లి, పాతబస్తి, మాదాపూర్, బోరబండ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ అమీర్ పేట్, దూల్ పేట్, కొండాపూర్, లింగంపల్లి, చందానగర్, సికింద్రాబాద్, కొంపల్లి, సరూర్ నగర్ నగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కాగా ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అవసరం ఉంటేనే బయటకు రావాలని వాతావరణ అధికారులు సూచించారు.


Similar News