BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్,

Update: 2024-07-02 16:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్, లక్డీకపూల్, తార్నాక, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హబ్సిగూడతో పాలు ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో వాహనదారులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ పక్క వర్షం మరోపక్కా ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నరకం చూస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. నగరంలో వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని అధికారులు అప్రమత్తం చేశారు.

Similar News