2023 ఎన్నికల్లో ప్రీ పోల్ , ఎక్సిట్ పోల్ 98 శాతం విజయం సాధించాం : చాణిక్య ముఖేష్..

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తీరులో.. సర్వేసంస్థలు.. ఎక్సిట్ పోల్స్ రాజకీయపార్టీల నుండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో... ప్రజలకు ఏం కావాలో తెలియజేయడంలో కీలకపాత్ర పోషించాయి.

Update: 2023-12-04 10:48 GMT

దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తీరులో.. సర్వేసంస్థలు.. ఎక్సిట్ పోల్స్ రాజకీయపార్టీల నుండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో... ప్రజలకు ఏం కావాలో తెలియజేయడంలో కీలకపాత్ర పోషించాయి. అనడంలో అతిశయోక్తి లేదన్నారు చాణిక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్ సంస్థ వ్యవస్థాపకులు చాణిక్య ముఖేష్. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ "చాణక్య స్ట్రేటజీస్ అండ్ సర్వేస్" ఇచ్చిన ప్రీ పోల్, ఎక్సిట్ పోల్ లో 98 శాతం విజయం సాధించాము అని చెప్పడానికి సంతోషిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో హుజురాబాద్ ఉపఎన్నిక, మునుగోడు ఉపఎన్నిక విషయంలో కూడా ఖచ్చితమైన ప్రీ పోల్ రిజల్ట్ ముందే ఇవ్వగలిగాం అన్నారు. ఇప్పుడు జరిగిన తెలంగాణా శాసనసభ సాధారణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో, ప్రతీ నియోజకవర్గానికి 1000 శాంపిల్స్ చొప్పున లక్షా పందొమ్మిదివేల శాంపిల్స్ సేకరించి సాంకేతికంగా మేము వెలువరించిన ఫలితాలు 98 శాతం ఖచ్చితమైన ఫలితాలు అయ్యాయి. ప్రతీసారి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని చర్చ జరిగేది కానీ ఈ సారి ఆ చర్చ ఉండబోదు అని ముందే చెప్పాం. అర్బన్, రూరల్ అని మాత్రమే చర్చ జరిగింది. ఏ సంస్థకు దొరకని రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ప్రజల నాడిని ముందే పసిగట్టి చెప్పడంలో కూడా మేమే విజయం సాధించాము అని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు.

"చాణక్య స్ట్రేటజీస్ అండ్ సర్వేస్" సంస్థ నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తున్నారో కూడా ముందే చెప్పి రాష్ట్రంలో సంచలనం అయ్యింది. అన్ని మీడియా సంస్థలు తమ సంస్థను ముందు వరుసలో పెట్టి ప్రచురించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల విషయంలో ఎవరికీ అంచనాలు కూడా లేని చోట్ల మేము చెప్పిన పార్టీ అభ్యర్థులే గెలిచారు. రెండు స్థానాలు మాత్రమే అటు ఇటు అయ్యాయి అన్నారు. ఈ రెండు జిల్లాల ఉదాహరణలు చాలు మేము ఎంత ఖచ్చితమైన సర్వేలను ప్రజల ముందు ఉంచుతామో చెప్పడానికి ఈ పరంపరలో మీడియా, పత్రికల పాత్ర మరువలేనిది. నిజాయితీ, ఖచ్చితత్వం ఉంటే మీడియా పత్రికా సంస్థలు ఎలా ఆదరిస్తాయి అనడానికి మా సంస్థ విషయంలో మీడియా చూపిన చొరవే ఉదాహరణ అని అన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆదరణ, మీ అందరి ప్రోత్సాహంతో మరింత ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చి... ప్రజల ఆకాంక్షలను తెలియజేయడంలో, ప్రజానాడిని పసిగట్టడంలో ముందుంటామని తెలియజేశారు.

Tags:    

Similar News