శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-09-27 06:19 GMT

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడి కావడంతో ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు నవీన్ యాదవ్ ఆరోపించారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని, కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని లేదంటే కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు. చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటనలు షరామామూలుగా మారాయని, ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని అన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు. వర్షాల నేపథ్యంలో పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయని చెబుతున్నారు.


Similar News