మంచినీళ్ల కోసం గొడవ..వ్యక్తిపై కత్తిపోట్లు

మంచినీళ్ల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి క్షణికావేశానికి గురై మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2025-02-14 16:09 GMT
మంచినీళ్ల కోసం గొడవ..వ్యక్తిపై కత్తిపోట్లు
  • whatsapp icon

దిశ, కార్వాన్ : మంచినీళ్ల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి క్షణికావేశానికి గురై మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 22 సమీపంలోని ఓ నిర్మాణ భవనంలో పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉంటున్నారు. అయితే మహారాష్ట్ర అకోలా ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీర్(28), బీహార్ స్థానిక చెందిన అబ్దుల్ సమీ(21) మధ్య గురువారం రాత్రి 11 గంటలకు మంచి నీళ్ల విషయంలో గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన అబ్దుల్ సమీ కత్తితో సయ్యద్ సమీర్ పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సయ్యద్ ను నానల్ నగర్ లోని ఓలివ్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.


Similar News