ప్రతి జిల్లాలో జల శక్తి కేంద్రాల ఏర్పాటు

నీటి వనరుల పునరుద్ధరణ, పరిరక్షణకై కేంద్రం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని జల శక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ సింగ్ అన్నారు.

Update: 2024-09-18 16:10 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : నీటి వనరుల పునరుద్ధరణ, పరిరక్షణకై కేంద్రం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని జల శక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జల శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్, 2024 నారీ శక్తి సే జలశక్తి అనే ఇతివృత్తం పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనశక్తి అభియాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నీటి సంరక్షణ , నిర్వహణలో మహిళలు కీలక భూమిక నిర్వహించాలని, నీటి సంరక్షణ, ప్రాముఖ్యత, భూగర్భ జలాలు, నాణ్యమైన నీటి సరఫరా, స్వచ్ఛమైన నీటి వనరుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బృందం రాష్ట్రపతి నిలయం, బన్సీలాల్ పేట బావిని సందర్శించి ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాను జలశక్తి అభియాన్ లో భాగంగా నీటి సంరక్షణ ద్వారా హైదరాబాద్ జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుటకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ జిల్లా సరస్సుల భూమి అని, జిల్లాలో వేయికి పైగా సరస్సులు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో సివిల్ వర్క్స్ రెయిన్ హార్వెస్టింగ్ నిర్మాణాలు నిర్మించబడినవని తెలిపారు. నీటి పునరుద్ధరణ కోసం వాటర్ రీఛార్జ్ గుంతలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ లను ఏర్పాటు చేయకుండా వాల్టా చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు.

     200 మీటర్లు ఎక్కువ ప్లాట్లు కలిగిన నివాసితులు నీటి కనెక్షన్లను మంజూరు చేసే ముందు హెచ్ ఎం డబ్ల్యూఎస్ఎస్బీ , జీడబ్ల్యూ అనుమతి తో నీటి హార్వెస్టింగ్ నిర్మాణాలు కలిగి ఉండాలన్నారు. నీటి వనరుల పునరుద్ధరణ తోపాటు , వనరులను రక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జల శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి కె. జగన్నాథరావు, డీఈఓ ఆర్.రోహిణి, డాక్టర్ ఎం. సుధీర్ కుమార్, పి. సంధ్యారాణి, జీహెచ్ఎంసీ ఈఈ ఏ. నారాయణ, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ సీజీఎం ఎస్. పద్మజ, సర్కిల్ మేనేజర్ జి.జ్యోత్స్న ప్రియదర్శిని, ఎన్జీవో కల్పనా రమేష్, బి.పుష్పలత, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News