హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్వరకు డయాలసిస్సేవలు
గతంలో హైదరాబాద్ కే పరిమితమైన డయాలసిస్ సేవలను అన్ని జిల్లాల్లోకి విస్తరింపజేశామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు..
- 102 కేంద్రాల్లో నిర్వహణ
- - ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో హైదరాబాద్ కే పరిమితమైన డయాలసిస్ సేవలను అన్ని జిల్లాల్లోకి విస్తరింపజేశామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.‘‘గతంలో కిడ్నీ రోగం వస్తే.. ప్రాణాలు పోయినంత పని. వ్యయ ప్రయాసలు తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కానీ స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాం. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశాం. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయి. సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రస్తుతం డయాలసిస్ సేవలు అందించడం సగర్వంగా ఉంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్ పాస్‌లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది.”అంటూ మంత్రి హరీష్ ట్విట్టర్వేదికగా పేర్కొన్నారు.
కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని. వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి.
— Harish Rao Thanneeru (@BRSHarish) May 15, 2023
స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సీఎం కేసీఆర్ గారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన… pic.twitter.com/vfZ4k9bZ4N