కొనసాగిన కూల్చివేతలు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) అధికారులు తమ జోరు కొనసాగిస్తున్నారు.

Update: 2024-08-11 12:10 GMT

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) అధికారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. శని, ఆదివారాలు అనేది కూడా చూడకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో ప్లాట్ నెంబర్ 148, 149,150లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొద్దిరోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

    ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. తొలిరోజు ఒక ఇంటిని కూల్చిన అధికారులు ఆదివారం అయినా కూల్చివేతలను కొనసాగించారు. అనధికార నిర్మాణాలను, బఫర్, ఎఫ్టీఎల్ లో కట్టిన నిర్మాణాలపట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చివేతలను దగ్గరుండి పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాలను, చెరువు కబ్జాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Tags:    

Similar News