ఏప్రిల్ 6న ప్రశ్నించే పాలకుల అణచివేత అంశం పై సదస్సు..

గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిపిన సందర్భంగా ప్రశ్నించే పాలకుల అణచివేత అంశంపై సదస్సును ఏప్రిల్ 6 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్ వెల్లడించారు.

Update: 2025-04-01 10:34 GMT
ఏప్రిల్ 6న ప్రశ్నించే పాలకుల అణచివేత అంశం పై సదస్సు..
  • whatsapp icon

దిశ, హిమాయత్ నగర్ : గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిపిన సందర్భంగా ప్రశ్నించే పాలకుల అణచివేత అంశంపై సదస్సును ఏప్రిల్ 6 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు సంబంధించిన గోడ పత్రికను గద్దర్ ఫౌండర్ సూర్య కిరణ్, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లం నాయక్, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1997లో గద్దర్ పై కాల్పులు జరిగాయని, అప్పటి ప్రభుత్వాలు ఎవరు కాల్పులు జరిపారో తేల్చలేదని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం గద్దర్ పై కాల్పులు ఎవరు జరిపారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గద్దర్ తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు అని, పీడిత ప్రజల వేదనను చూడలేక కాలమే గద్దర్‌ను కన్నదని ఉద్యమకారులు చెబుతారన్నారు. ఆయన పాటకు అంత శక్తి ఉంది. ప్రజల్లో చైతన్యం నింపింది. ప్రభుత్వాలను కదిలించింది. నిత్యం ప్రజా సమస్యల పై పోరాటం సాగించిన గద్దర్ ‘ప్రజా యుద్ధనౌక’ అయ్యారని తెలిపారు. మలి దశ ఉద్యమాన్ని ఉరకలెత్తించినా గద్దర్‌కే చెల్లింది. తన పాటల ద్వారా ఎంతో మందిలో ఉత్తేజం కలిగించారు. ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. పెద్ద ఎత్తున గద్దర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ వెంకట్ రెడ్డి, వినయ్ శంకర్, శ్రీరాములు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News